Mudragada Padmanabham Biography: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రత్యేకం. కాపు రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న ఉద్యమకారుడు. ఆయననే ముద్రగడ పద్మనాభం. ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితం మీకోసం.
బాల్యం, కుటుంబం
ముద్రగడ పద్మనాభం.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లో తెలుగు కాపు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు వీర రాఘవరావు. పద్మనాభం తన పాఠశాల విద్యను స్వగ్రామంలో సాగింది. వారిది రాజకీయ కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం మున్సబ్ గా పనిచేశారు. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేవారు. ఆయన 1962, 1967లో రెండుసార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తన నియోజకవర్గంలోని నిరుపేద, దళితులకు ఆయన అభిమాన నాయకుడు. ఆయన జీవిత కాలం అంతా నిరుపేదలకు ఏదో రకంగా సహాయం చేశారు.
రాజకీయ ప్రస్థానం
మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమాన పాత్రుడైన ముద్రగడ వీర రాఘవరావు 1977లో మరణించారు. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభంను రాజకీయాల్లోకి రావాలని నీలం సంజీవరెడ్డి సూచించారు. ఆయన సూచన మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తొలిసారి 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రిని చూసుకున్నారు. ఆవిధంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముద్రగడ్డ 1978 నుంచి 1989 వరకు నాలుగు సార్లు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే.. తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం .. ఆ తర్వాత 1982లో ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.
టీడీపీకి రాజీనామా..
తెలుగుదేశంలో పార్టీలో తలెత్తిన అంతర్గత కలహాల వల్ల ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన ఆయన తన మంత్రి పదవీతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ప్రజారక్షణ సమితి అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. తరువాత.. తెలుగుదేశం, కాంగ్రెస్లో ఉన్న కెఇ కృష్ణమూర్తి, కుందూరు జానా రెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని ప్రారంభించాడు . 1988లో అప్పటి ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989 ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి పోటీచేసి గెలుపొందారు. కానీ, 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓటమిపాలయ్యారు. ఓటమితో నిర్వేదానికి లోనైనా ఆయన మరోసారి ప్రతిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. ఆ తరువాత 1999, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
ప్రజారాజ్యంలో చేరిక
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రతిపాడు నుంచి కాకుండా కాపు ఓటర్ లో అధికంగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత 2019లో పిఠాపురం నుంచి ఓటమి పాలయ్యారు.
కాపు ఉద్యమం
1915 నాటి నుంచి 1956 లో ఏపీ రాష్ట్రం ఏర్పడే వరకు కాపులకి రిజర్వేషన్ లు ఉన్నాయి. 1956 తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాపులను బీసీ జాబితా నుంచి తొలగించారు. 1961లో సీఎం దామోదరం సంజీవయ్య అప్పటి పరిస్థితులు అర్థం చేసుకొని కొనసాగించారు. ఆ తరువాత 1966 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కాపుల రిజర్వేషన్లు రద్దు చేసింది. ఆ తరువాత కాలంలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కాపు పలు మార్లు నిరసనలు చేపట్టారు. క్రమంగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, కాపు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి పురోగతి లేదని భావించిన ముద్రగడ 1994 జూలై 1న కాపు, బలిజ, ఒంటరి తెల్లగా కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని, ఆయన సతీమణి పద్మావతి తో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ ఒక జీవో (జీవో నం. 30) జారీ చేయించారు. ఆ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. తరువాత డివిజన్ బెంచి సమర్థించింది. 2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్యగర్జన సభ ద్వారా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి. కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ పద్మనాభం, ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ పిలుపునిచ్చారు. ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ సభలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
వైసీపీలో చేరిక
ఇదిలా ఉంటే.. 15 మార్చి 2024న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు . ఆయన వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులి శ్రీరాములు ఆయనను ఖండించారు.
Download App:
Copyright ©arkaxis.xb-sweden.edu.pl 2025